YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కన్నడ నాట భారీ వర్షాలు

కన్నడ నాట భారీ వర్షాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 కర్ణాటకను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద బాధితుల సహాయార్థం జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. బెళగావిలో ఆరుగురు మృతి చెందగా.. ఉత్తర కన్నడలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా మైసూరు -హెచ్‌డీ కోటే రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. బెళగావి, బాగల్‌కోట్‌, రాయ్‌చూర్‌ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలకు చెందిన 16,875 మందిని  272 పునరావాస కేంద్రాలకు తరలించారు. ముదోల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సందర్శించారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు.

వర్ష ప్రభావం నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరింది. ఈనేపథ్యంలో ఇందువల్లే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి. దీనిపై కర్ణాటక సీఎం స్పందించారు. ఆల్మట్టి జలాశయం వల్ల మహారాష్ట్రకు ఎలాంటి నష్టం లేదని, మీడియా అసత్య ప్రచారం చేయరాదని సూచించారు. ఆ రాష్ట్రానికి ఆల్మట్టి ఎంతో దూరంలో ఉందన్నారు.

Related Posts