YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

బీజేపీలో చేరిన వివేక్

బీజేపీలో చేరిన వివేక్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మాజీ ఎంపీ వివేక్ శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, టీ-బీజేపీ నేత లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్తో వివేక్ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు భాజపాలోకి వస్తారని భాజపా అధిష్ఠానానికి వివేక్ తెలిపినట్లు సమాచారం.. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ బీజేపీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. కేసీఆర్ను గద్దె దింపుతామని, ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తామన్నారు. రాజకీయాల్లో ఉన్నానని, పార్టీ మారితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పని చేయాలి కానీ, నిరంకుశంగా వారి గొంతులని అణగ తొక్కాలని చూస్తుంది. అదేవిధంగా తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతుంది. తెలంగాణాలో అభివృద్ధి అనేది కొందరి కుటుంబాలకి మాత్రమే పరిమితమైంది. ప్రజలకు మాత్రం ప్రభుత్వ పథకాలు నీటి మీద రాతలుగా మిగిలాయని అయన అన్నారు.  మార్పు అనేది రావాలి, నిజమైన తెలంగాణ ప్రజావాణి వినిపించాలి. బంగారు తెలంగాణ అనేది మాటలలో కాదు, చేతలలో చూపించాలి. ఇది కేవలం బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నాను..’అని వివేక్ పేర్కొన్నారు.

Related Posts