YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు....

 చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు....

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

ఆర్టికల్‌ 370, 35(ఏ)ను రద్దు చేసిన రెండు రోజుల తర్వాత... ప్రధాని మోదీ ప్రజల ముందుకు వచ్చారు. గురువారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను... మరీ ముఖ్యంగా కశ్మీరీలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మార్పు జరిగింది. మేలు కూడా జరుగుతుంది’ అని భరోసా ఇచ్చారు. కశ్మీరీల కష్టం మొత్తం 130 కోట్ల మంది భారతీయుల కష్టమని తెలిపారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలని భావోద్వేగభరితమైన పిలుపునిచ్చారు. కొత్త భారత్‌, సరికొత్త జమ్మూకశ్మీర్‌... కొంగొత్త లద్ధాఖ్‌ను నిర్మిద్దాం అని దేశవాసులకు పిలుపునిచ్చారు. ‘మార్పు జరిగింది. మేలు కూడా జరుగుతుంది. కశ్మీర్‌ భారత దేశానికే మణిమకుటం. కశ్మీరీల కష్టం మొత్తం 130 కోట్ల మంది భారతీయుల కష్టం. వారి కష్ట సుఖాల్లో మనమందరం పాలుపంచుకుందాం. ఆర్టికల్‌ 370 నుంచి కశ్మీరీలకు విముక్తి లభించింది. ఇక... కశ్మీర్‌, లద్ధాఖ్‌ సర్వోన్నతికి ఒక్కటై పని చేద్దాం. భూతల స్వర్గమైన కశ్మీర్‌ అభివృద్ధిలో సరికొత్త శిఖరాలు అందుకోవాలి. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన నేల. ఇక్కడ వికసించే శాంతితో... ప్రపంచ శాంతి కూడా విలసిల్లుతుంది. కశ్మీర్‌ అభివృద్ధి భారత్‌నూ అభివృద్ధి చేస్తుంది. మీరూ రండి... కొత్త భారత్‌, సరికొత్త జమ్మూ కశ్మీర్‌... కొంగొత్త లద్ధాఖ్‌ను నిర్మిద్దాం’’  కశ్మీరీ శాలువాలు, కళాకృతులు ప్రతి ఇంటి అందాన్నీ పెంచాలి. లద్ధాఖ్‌ సేంద్రియ ఉత్పత్తులు, మూలికలు ఆరోగ్య భాగ్యం పంచాలి. కశ్మీర్‌... సరికొత్తగా వికసించాలి. మళ్లీ భూతల స్వర్గం కావాలి. ఇందుకు మనమంతా కలిసి రావాలి.. అని  దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
    అదే విధంగా అయన లద్దాఖ్‌ కోసం ప్రసంగిస్తూ.. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాం. ఇక... అక్కడి ప్రజల అభివృద్ధి భారత ప్రభుత్వ బాధ్యత. దీని కోసం స్థానికులతోపాటు లద్దాఖ్‌, కార్గిల్‌ అభివృద్ధి మండళ్లతో చర్చలు జరుపుతాం. సాహస, పర్యావరణ పర్యాటకానికి లద్దాఖ్‌ అతిపెద్ద కేంద్రంగా మారే అవకాశముంది. సోలార్‌ రేడియేషన్‌లో దేశంలోనే లద్దాఖ్‌ నంబర్‌ వన్‌. ఇక్కడ సౌర విద్యుదుత్పత్తికి ఎంతో అవకాశముంది అని అన్నారు. అలాగే అయన సినీ పరిశ్రమను ఆదేశించి కూడా ప్రసంగించారు... దేశంలో హిందీ తర్వాత రాశి, వాసిలో తెలుగు, తమిళ సినిమాలదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలోనే... సుందర కశ్మీర్‌లో సినిమాల చిత్రీకరణకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
    నిన్న ప్రధాని ప్రసంగంలో ముఖ్యంగా కశ్మీరీలను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీరీలకు మేలు జరుగుతుందని అయన అన్నారు.. ఈ విషయం దేశ ప్రజలందరికి తెలిసింది కానీ , కాశ్మీర్ ప్రజలకు తెలియలేదు. ఎందుకంటే కాశ్మీర్ లో ఇంటర్నెట్, టీవీ, కరెంటు సదుపాయలు లేవు..  కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ లేకుండా చేసి ప్రధాని గంటల కొద్దీ వాళ్ళకి ధైర్యం  చెప్పితే అక్కడవున్న ప్రజలకి ఎలా తెలుస్తుందో మరి..

Related Posts