YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

యాంకర్ ప్రదీప్‌కు శిక్షా? జరిమానానా?

యాంకర్ ప్రదీప్‌కు శిక్షా? జరిమానానా?

 

పీకలదాకా మద్యం సేవించి కారు నడిపిన ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అష్ట కష్టాలమ్మీద కౌన్సిలింగ్‌కు రప్పించారు. తాజాగా శుక్రవారం నాడు ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ప్రదీప్‌ను జూబ్లిహిల్స్‌ ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా 22వ తేదీన కోర్టుకు వస్తానని చెప్పిన ప్రదీప్ రెండు రోజుల ముందే కోర్టుకు హాజరయ్యాడు. అయితే ఈ కేసులో ప్రదీప్‌కు శిక్షా? లేదా జరిమానానా? అనేది కాసేపట్లో తేల్చనుంది. అయితే కోర్టు విచారణలో ఏం జరుగుతుందో ఏమో అని ప్రదీప్ కుటుంబీకులు, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఇప్పటికే ప్రదీప్ బంధువులు, కుటుంబీకులు కోర్టుకు చేరుకున్నారు.

కాగా.. మోతాదుకు మించి నాలుగైదు రెట్లు ఎక్కువగా మద్యం సేవించిన  ప్రదీప్‌పై కేసు నమోదు చేసుకుని ఆయన కారును జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కౌన్సిలింగ్, కోర్టుకు హాజరుకాకుండా ఇప్పుడొస్తా.. రేపొస్తా అంటూ ఎట్టకేలకు పది రోజుల క్రితం కౌన్సిలింగ్ హాజరై జనవరి 19న నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. మొత్తానికి చూస్తే పోలీసులకు మాత్రం యాంకర్ ప్రదీప్ చుక్కలు చూపించాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో.! 

Related Posts