తెలంగాణ మిలియన్ మార్చ్ 'స్ఫూర్తి' సమావేశానికి అనుమతి నిరాకరించిన పోలీసులు.దీని పై టీజాక్ చైర్మన్ కోదండరాం మండి పడ్డారు. రాష్ట్రం కలిసి ఉన్నపుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు అని అయన అన్నారు . అరెస్టులతో ఎవర్ని అణచివేయలేరు అని ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వం అణచివేయడం తప్ప ఇంకేం కాదు అని అన్నారు . ఇప్పటికే జిల్లాలో నుంచి వస్తున్న నేతలని,కార్యకర్తలని ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు కోదండరాం.