Highlights
- తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరినట్టు సమాచారం
- కేసీఆర్ మాటే నా బాట
- ఇలాంటి పుకార్లకి ప్రచారం కల్పించవద్దని మీడియా ప్రతినిధులను హరీష్ రావు కోరారు
తాను చచ్చేంతవరకు తెరాస పార్టీ లోనే ఉంటాను నా పుట్టుక, చావు రెండూ టీఆర్ఎస్ లోనే తప్ప ఇంకో పార్టీ వైపు చూసే ప్రస్తక్తి లేదని తేల్చేసారు, తాను టీఆర్ఎస్ లో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, కేసీఆర్ మాటే తన బాట అని ఆయన స్పష్టం చేశారు.కేసీఆర్ ఆదేశిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులు కూడా గడ్డిపోచగా వదిలేస్తాం. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దు.ఇలాంటి పుకార్లకు అందరూ ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. ఇలాంటి పుకార్లకి ప్రచారం కల్పించవద్దని మీడియా ప్రతినిధులను హరీష్ రావు కోరారు.