యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు లాంటి సంచలనాలను సృష్టించిన భాజపా ప్రభుత్వం, మరో కీలక బిల్లుకు సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశంలోని పేదవారే లక్ష్యంగా మత మార్పిడిలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మతమార్పుడులను నిషేధించేందుకు మోదీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నది. దీని కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మతమార్పుడల వ్యతిరేక బిల్లుకు కావాల్సిన అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అయితే మోడీ సర్కార్ మరో సంచలనం సృష్టించినట్లే. కాగా గత పార్లమెంట్ లో రాజ్యసభలో సరైన బలం లేనందున మౌనంగా ఉన్న మోడీ ప్రభుత్వం..ఇప్పుడు బలం పెరగడంతో పలు కీలక బిల్లులపై దృష్టి సారించింది.