యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాకి సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఈ సీనియర్ హిట్టర్‌కి తాజాగా నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. సర్జరీ కారణంగా కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు క్రికెట్‌కి ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
భారత్ తరఫున గత ఏడాది జూలైలో చివరిగా వన్డేలాడిన సురేశ్ రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. కానీ.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు.. ఈ ఏడాది ముగిసి ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో..ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఈనెల 17 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుండగా.. శస్త్ర చికిత్స కారణంగా ఈ టోర్నీకి సురేశ్ రైనా దూరంగా ఉండనున్నాడు. అంతేకాకుండా.. సెప్టెంబరు 24 నుంచి ఆరంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా కొన్ని మ్యాచ్‌లకి కూడా ఈ హిట్టర్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి