YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీలో కొత్త కోణం చూపించే మ్యాన్ వర్సెస్ వైల్డ్

మోడీలో కొత్త కోణం చూపించే మ్యాన్ వర్సెస్ వైల్డ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

డిస్కవరీ ఛానల్ లో రెగ్యులర్ గా ప్రసారం అయ్యే ఎపిసోడ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్. బ్రిటన్ కు చెందిన ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఈ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. ఈ నెల 12వ తేదీన రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్ లో  ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించి ఇదివరకే ఓ ఇంట్రో ప్రొమో విడుదలైంది. తాజాగా మరో క్లిప్ ను విడుదల చేసింది ఛానల్ యాజమాన్యం. ఇదివరకు విడుదలైన ప్రొమోతో పోల్చుకుంటే.. ఈ తాజా క్లిప్ లెంగ్త్ ఎక్కువ.బిగినింగ్ టు ఎండ్.. నరేంద్ర మోడీ దాదాపు అన్ని ఫ్రేముల్లోనూ కనిపిస్తారు. ఈ ఎపిసోడ్ ద్వారా ఆయన ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తున్నారనేది ఇందులో రివీల్ చేశారు.ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ లో నరేంద్ర మోడీ తన మనోగతాన్ని ఆవిష్కరించినట్టు కనిపిస్తోంది. భారతీయ తత్వాన్ని ఆయన ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారనే అనుకోవచ్చు. అప్పటికప్పుడు ఓ బల్లెంను తయారు చేసిన బేర్ గ్రిల్స్, దాన్ని మోడీ చేతికి ఇస్తూ, క్రూరమృగాలు ఎదురొస్తే.. వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించబోగా.. హింస తమ విధానం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేయడం కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ లో. ఎవ్వరినైనా, దేన్నయినా బాధపెట్టడం, కొట్టడం తన సంస్కృతి కాదని వివరించారు. అందుకే తమకు ఆయుధాలతో పని లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దీన్ని మీ కోసం (బేర్ గ్రిల్స్) తృప్తి కోసం దగ్గర ఉంచుకుంటా..` అని నరేంద్ర మోడీ ఆ బల్లెంను చేతపట్టుకుని బయలుదేరుతారు.ప్రకృతిని పూజించడం భారతీయ తత్వమని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రకృతికి ఎదురెళ్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. ప్రకృతిని విధ్వంసం చేయాలని మనిషి నిర్ణయం తీసుకుంటే.. అతనికి అన్నీ ప్రమాదకరంగానే కనిపిస్తాయని అన్నారు. మనిషి సైతం అత్యంత ప్రమాదకారి అని చెప్పారు. ప్రకృతిని పరిరక్షించడానికి మనం ప్రయత్నిస్తే.. అదే మనల్ని కాపాడుతుందని, పురోగమనానికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రకృతిని ప్రేమించడం తన అభిమతమని, తనకు 17-18 సంవత్సరాల వయస్సులోనే ఇంటిని వదిలేశానని, హిమాలయాల్లో గడిపానని చెప్పుకొచ్చారు. స్వచ్ఛభారత్ అంశాన్ని కూడా నరేంద్ర మోడీ ఇందులో స్పృశించినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై ఆయన బేర్ గ్రిల్స్ తో ముచ్చటించడాన్ని మనం ఈ క్లిప్ లో కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత అనేది భారతీయుల రక్తంలోనే ఉందని, ఎవరో వచ్చి మన దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తమ దేశాన్ని తామే పరిశుభ్రంగా, స్పటికంలా స్వచ్ఛంగా ఉంచుకునే శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉన్నాయని కితాబిచ్చారు. స్వచ్ఛత విషయం జాతిపిత మహాత్మాగాంధీ చేసిన అకుంఠిత ప్రయత్నాలు ఫలించాయని అన్నారు.ఈ ఎపిసోడ్ ప్రసారం తేదీ ఖరారైన నేపథ్యంలో.. బేర్ గ్రిల్స్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నరేంద్ర మోడీపై చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ లోని కొన్ని కీలక ఘట్టాలను తీసుకుని కట్ చేసిన ప్రోమో అది. ఈ ఎపిసోడ్ మొత్తం 180 దేశాల్లో ప్రసారం కానుంది. ఆయా దేశాల ప్రజలు సరికొత్త మోడీని చూస్తారని అంటూ బేర్ గ్రిల్స్ వ్యాఖ్యానించారు. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ఈ సాహసానికి పూనుకున్నారని ప్రశంసించారు. ఈ ఎపిసోడ్ ప్రసారమైన తరువాత ప్రజలకు అడ్వెంచర్ ట్రిప్ లపై మరింత ఆసక్తి కలుగుతుందని, వన్యజీవులను సంరక్షించాలనే బాధ్యత గుర్తుకు వస్తుందని అన్నారు. ప్రకృతిని ఆరాధించడం భారతీయుల్లో పుట్టుకతోనే వచ్చిందని చెప్పారు. హిందువులు జరుపుకొనే పండుగల్లో ప్రకృతి ఓ భాగం అని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిస్కవరీ ఛానల్ రూపొందించిన ఈ షోలో బేర్ గ్రిల్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు మోదీ. ఇప్పటికే ఆ ఛానల్ ప్రోమో రిలీజ్ చేసి..షోపై హైప్ క్రియేట్ చేసింది.ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తో కొద్దిసేపు గడిపారు ప్రధాని మోదీ. కాకులు దూరని కారడవుల్లో ప్రధాని మోదీ చేసిన  సాహసాలను చూపించబోతున్నారు.  వీరిరువురూ చేసిన జర్నీ ఈ నెల 12న 180 దేశాల్లో..8 భాషల్లో..ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో ప్రసారం కాబోతోంది. దీంతో నమో అడవుల్లో ఏం చేశారు..? ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారోనని ఆసక్తి నెలకొంది.ఐతే వన్యప్రాణులను ఎలా సంరక్షించాలి, పర్యావరణ మార్పులపై ఈ షోలో వివరించబోతున్నారు. మరో వైపు  ఈ షో మోదీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పి ఆసక్తిని పెంచేశాడు.  బేర్ గ్రిల్స్ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. భారత్ లో ఉన్న అద్భుత ప్రదేశాలను ఈ ప్రోగ్రాంలో చూడొచ్చని స్పష్టం చేశారు.

Related Posts