YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోన్ తీసుకున్నందుకు 8 వేలు ఆధా

లోన్ తీసుకున్నందుకు 8 వేలు ఆధా

మీకు గృహ రుణం ఉందా? అయితే మీకు దసరా పండుగ ముందుగానే వచ్చింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు తగ్గింపుతో హోమ్ లోన్ తీసుకున్న వారికి తీపికబురు అందింది. దీంతో ఈఎంఐ భారం తగ్గనుంది. మీరు 20 ఏళ్ల కాలానికి రూ.30 లక్షల లోన్ తీసుకొని ఉంటే.. మీకు వార్షిక ఈఎంఐ మొత్తంపై రూ.8,000కు పైగా ప్రయోజనం పొందొచ్చు. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు వాటి కస్టమర్లకు ఏ స్థాయిలో బదిలీ చేస్తాయనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్లకు రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. వడ్డీ రేటు 9.55 శాతం. మీకు నెలకు రూ.18,708 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుతో ఈఎంఐ భారం రూ.18,253కు దిగొస్తుంది. అదే మీరు రూ.30 లక్షల లోన్ తీసుకుంటే ఈఎంఐ భారం రూ.28,062 నుంచి రూ.27,379కు తగ్గుతుంది. అదే రూ.50 లక్షల రుణంపై ఈఎంఐ భారం రూ.46,770 నుంచి రూ.45,631కు దిగొస్తుంది. ఇకపోతే రూ.80 లక్షల హోమ్ లోన్‌పై ఈఎంఐ రూ.74,832 నుంచి రూ.73,010కు తగ్గుతుంది. రూ.కోటి రుణంపై ఈఎంఐ రూ.93,540 నుంచి రూ.91,263 దిగొస్తుంది. కాగా రిజర్వు బ్యాంక్ ఈ ఏడాది ఇప్పటిదాకా నాలుగు సార్లు వ డ్డీ రేట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 5.4 శాతానికి దిగొచ్చింది. రేట్ల కోతతో రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ వృద్ధి పుంజుకుంటుందని తెలిపారు. 

Related Posts