YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కశ్మీర్ లో సద్దుమణుగుతున్న పరిస్థితులు

 కశ్మీర్ లో సద్దుమణుగుతున్న పరిస్థితులు

కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. వారం రోజులుగా భద్రతా బలగాల వలయంలో ఉన్న జమ్మూ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో శనివారం నుంచి అక్కడ 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు జమ్మూ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ ప్రకటించారు. శనివారం నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.భద్రతా పరమైన ఆంక్షలు ఎత్తివేయడంతో శుక్రవారం జమ్మూలో అనేకమంది ముస్లింలు మసీదులకు వచ్చి ప్రార్థనలు చేశారు. జమ్మూలో పరిస్థితులు చక్కబడుతున్నా కశ్మీర్‌లో మాత్రం ఇంకా ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సలహా మేరకు కశ్మీర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

Related Posts