YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

18 న ఎపి సెట్ నోటిఫికేషన్

Highlights

  • జులై 1 న సెట్ పరీక్షలు
  • ఎయు ఉపకులపతి వెల్లడి 
18 న ఎపి సెట్ నోటిఫికేషన్

ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్విహించే ఎపి సెట్ -2018 కు సంబంధించి ఈనెల 18న నోటిఫికేషన్ ను  విడదల చేయనున్నట్టు ఎయు ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెల  26 నుంచి దరఖాస్తులను  ఆన్ లైన్ లో  స్వీకరిస్తామని చెప్పారు. దరఖాస్తు స్వీకరణకు  మే 2 వ తేదీ వరకు గడువు ఇచ్చామన్నారు. అయితే  అపరాధ రుసుముతో జూన్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు  చెప్పారు. గతంలో ప్రతి సబ్జెక్టులో మూడు పేపర్లు ఉండేవని, యూజీసీ నిబంధనల ప్రకారం ఈ యేడాది నుంచి రెండు పేపర్లు మాత్రమే ఉంటాయని వివరించారు. ఈసారి నెగిటివ్ మార్కులు లేవని స్పష్టం చేశారు. మొత్తం రాసిన వారిలో ఆరుశాతం మందిని మాత్రమే అర్హులుగా చేయాలని యూజీసీ నిబంధన ఉందన్నారు.

Related Posts