YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాణించలేకపోతున్న అఖిల ప్రియ

రాణించలేకపోతున్న అఖిల ప్రియ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భూమా అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరా? లేక మరోచోట నుంచి పోటీకి దిగుతారా? ఇదే నంద్యాలలో చర్చనీయాంశమైంది. భూమా అఖిలప్రియ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలయ్యారు. తల్లి, తండ్రి, తాత ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందుకున్నప్పటికీ రాజకీయాల్లో రాణించలేకపోయారు. పార్టీ మారడంతో మంత్రి పదవి దక్కినా ఆమె తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడం భూమా కుటుంబంలో చిచ్చురేపిన సంగతి తెలిసిందే.ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియ గంగుల కుటుంబం చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం భూమా కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. భూమా కుటుంబం నుంచి కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. భూమా అఖిలప్రియ పెండ్లి తర్వాత కుటుంబంలో విభేదాలు తలెత్తాయంటారు. భూమా అఖిలప్రియ భర్త వ్యవహారశైలి నచ్చడం లేదని కుటుంబ సభ్యులే బహిరంగంగా చెబుతున్నారు. దీంతో భూమా అఖిలప్రియ కొత్త వ్యూహానికి తెరలేపారంటున్నారు.భూమా అఖిలప్రియ ఇటీవల భూమా వారసుడిగా తన సోదరుడు విఖ్యాత్ రెడ్డిని ప్రకటించారు. భూమా వారసుడిగా విఖ్యాత్ రెడ్డి ఉంటారని అఖిలప్రియ కార్యకర్తల సమావేశంలో చెప్పడం చర్చనీయాంశమైంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పోటీకి దిగకుండా విఖ్యాత్ రెడ్డిని బరిలోకి దించాలన్న యోచనలో ఉన్నారు. మరి భూమా అఖిలప్రియ ఏంచేస్తారన్న చర్చ కూడా మొదలయింది.అయితే తన సోదరుడు వి‌ఖ్యాత్ రెడ్డిని ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి తాను నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న యోచన చేస్తున్నారట అఖిలప్రియ. నంద్యాలలో తన తండ్రి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. పైగా బ్రహ్మానందరెడ్డితోనూ అఖిలప్రియ కు కొంత గ్యాప్ వచ్చిందంటున్నారు. తన తండ్రి నియోజకవర్గమైన నంద్యాల నుంచి తాను పోటీచేస్తే విజయం ఖాయమని భావిస్తున్నారు. అందుకే భూమా వారసుడిగా తన సోదరుడు విఖ్యాత్ రెడ్డిని ప్రకటించారని అంటున్నారు. మొత్తం మీద భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు షిఫ్ట్ అవుతున్నారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.

Related Posts