యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ పోరాటం 42 ఓవర్లలో 210 పరుగుల వద్దే ముగిసింది. ఓపెనర్ లూయిస్(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్(42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలరల్లో షమి(2/39), కుల్దీప్(2/59) ఆకట్టుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్(71; 68బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.