Highlights
- ఎన్డీయేలో కొనసాగింపుపై టీడీపీ మల్లగుల్లాలు
- తర్జనభర్జనలో స్ట్రాటజీ కమిటీ
- విస్తృత భేటీలతో కసరత్తు
రాజ్య సభకు పంపే అభ్యర్థుల ఎంపిక పై తెలుగు దేశం పార్టీ దృష్టి కేంద్రేకరించింది. ఇందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానున్నది. ఆదివారం జరిగే ఈ సమావేశం రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేంద్రంలోని ఎన్డీయేలో కొనసాగుతున్న అంశంపై ఏ పార్టీ మల్లాగుల్లాలుపడుతుంది. నరేంద్ర మోడీ మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎన్డీయే మిత్రపక్షంగా వ్యహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయంలో పెద్ద ఎత్తున వస్తున్నా విమర్శలను తిప్పి కొట్టేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, కళ వెంకట్రావు, పయ్యావుల కేశవ్‌లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై ప్రతిరోజు చంద్రబాబుతో చర్చించనుంది.