ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పోర్టర్‌గా రిలయన్స్ ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. రిలయన్స్ ఇప్పుడు కొత్త రిలయన్స్‌గా మారుతోందని .. న్యూ ఇండియా.. న్యూ రిలయన్స్ నినాదంతో దూసుకెళ్తుందని అన్నారు. 2030 నాటికి భారత ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిలయన్స్ పెట్రోలియంతో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ‘బీపీ ఆయిల్ ఇండస్ట్రీ’ చేతులు కలపబోతోందని చెప్పారు. సౌదీ కంపెనీ ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు పెట్టబోతోందని ముఖేశ్ అంబానీ అన్నారు.జియో డేటా.. భారత్‌ను ప్రకాశవంతంగా మార్చేసిందని అంబానీ అన్నారు. భారతీయులు డిజిటల్‌పై ఏటా రూ.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రతి నెల కోటి మంది కొత్త వినియోగదారులు జియోలో చేరుతున్నారని వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్ అధినేత, సీంఎడీ ముకేశ్ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్‌కు తరలి వచ్చింది. ముఖ్యంగా ముకేశ్ అంబానీ తల్లి, భార్య నీతూ అంబానీ, కుమార్తె ఆశ, కుమారుడు ఆకాశ్ అంబానీతోపాటు కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు. దేశంలో అత్యున్నత విలువ కల కంపెనీగా తన సత్తా చాటుదోందని, భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ కీలక భూమికను పోషిస్తోందని తెలిపారు. రిలయన్స్ వృద్ధి, అలాగే భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం ఉన్నంత ప్రకాశవంతంగా ఇంతకుముందెన్నడూ కనిపించలేదని అంబానీ పేర్కొన్నారు. ఇండియా వృద్ధిని, రిలయన్స్ ఎదుగుదలను ఆపడం ఎవ్వరి తరమూ కాదని ఆయన వెల్లడించారు. న్యూ ఇండియా, న్యూ రిలయన్స్ అనే నినాదాన్నిచ్చారు. ఈ సందర్భంగా రిలయన్స్, బీపీ ఒప్పందాన్నిప్రస్తావించారు. వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం. రిలయన్స్ భవిష్యత్తు ప్రణాళికలపై అంబానీ చేయనున్న ప్రకటనలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అంబానీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు :
2030 నాటికి భారత ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
రిలయన్స్ పెట్రోలియంతో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ‘బీపీ ఆయిల్ ఇండస్ట్రీ’ చేతులు కలపబోతోంది.
సౌదీ కంపెనీ ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు .
భారతీయులు డిజిటల్‌పై ఏటా రూ.5లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, దానిలో భాగంగా జియో రూ.3.5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
జియో మూడేళ్లు పూర్తి చేసుకోబోతోంది.
వినియోగదారుల సంఖ్యలో 340 మిలియన్ల మార్క్‌ను దాటేశాం.
జియో వినియోగదారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ ఘనతను సాధించాం.
ప్రతి నెల కోటి మంది కొత్త వినియోగదారులు కొత్తగా జియోలో చేరుతున్నారు.