YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కేబినెట్ల్లో కి కొత్త ముఖాలు..?

Highlights

  • కేంద్రంలో ఎవరో ఒకరికే బెర్త్ కన్ఫామ్ 
  • రాష్ట్రంలో ఆశావాహుల జాబితా పెద్దదే..
  • మైనార్టీ, ఎస్సిలకు ఛాన్స్..? 
     
కేబినెట్ల్లో కి కొత్త ముఖాలు..?

కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గాల్లో కొత్త ముఖాలకు ఛాన్స్ దొరకనున్నది. కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ తీసుకున్న నిర్ణయమే మంత్రి పదవుల ఆశావాహులకు అసలు చిగిరిస్తున్నాయి. కేంద్ర మంత్రి మండలి నుంచి టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వంలోంచి కమలనాధులు వైదొలగడంతో ఆయా మంత్రివర్గాల్లో చేర్పులు అనివార్యమయ్యాయి. రాష్ట్ర కేబినెట్ నుంచి బీజేపీ వైదొలగడం, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు రావడంతో రెండు మంత్రి వర్గాల్లోనూ కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో కేబినెట్ విస్తరణపైనే ప్రధానాంశంగా చర్చ సాగుతుంది.  ఆశావాహులు కూడా తమ తమ స్థాయిలో  ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
కేంద్ర మంత్రి మండలి నుంచి టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు తమ పదవులకు చేసిన రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదించిన సంగతి కూడా తెలిసిందే. దీనితో ఆ స్థానాల్లో ఏపీకి చెందిన బీజేపీ నాయకులు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజులకు బెర్త్ లు కన్ఫామ్ అయినట్టుగా ఆ పార్టీవర్గాల కధనం.కానీ ఈ రేసులో హరిబాబు ముందున్నట్టు సమాచారం. గతంలో చివరి నిమిషంలో హరిబాబుకు కేంద్ర మంత్రి పదవికి మిస్సయింది. ఈసారి మాత్రం వందశాతం పదవి తనకే వస్తుందని ఆయన భావిస్తున్నారు. మరోవైపు గోకరాజు గంగరాజు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సన్నిహితుడు కావడంతో ఆయన కూడా పదవిపై గట్టినమ్మకంతో ఉన్నారు.ఇక  రాష్ట్రంలో  ఖాళీ అయిన స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ వర్గాల్లో కూడా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమైన నేపథ్యంలో ముస్లింలకు, ఎస్టీలకు అకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ రెండు సామాజిక వర్గాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం, ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం మిగిలి ఉండటంతో కొత్త మంత్రులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కామినేని కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించగా.. మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా నుంచి గెలుపొందారు. గత మంత్రివర్గ విస్తరణలో ముస్లింలకు చోటు దక్కకపోవడంతో ఆ వర్గం నుంచి వ్యతిరేకత ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని ముస్లింనేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలున్నారు. వీరిలో జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్, చాంద్ బాషా కదిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరినవాళ్లే. ఎమ్మెల్సీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎం.ఎ.షరీఫ్, కర్నూలుకు చెందిన ఎన్ఎండీఫరూక్ ఉన్నారు. ఫరూక్కు శాసన మండలి ఛైర్మన్ పదవి ఇవ్వగా.. షరీఫ్ కు విప్ ఇచ్చారు. ఐతే మంత్రుల్లో కృష్ణాజిల్లా నుంచి ఖాళీ ఏర్పడటంతో తనకు పదవి గ్యారెంటీ అని జలీల్ ఖాన్ భావిస్తున్నారు.మంత్రి వర్గంలో ఇప్పటివరకు ఎస్టీలకు అవకాశం రాలేదు. దీంతో టీడీపీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు తనకు అవకాశం వస్తుందని ఆశగా ఉన్నారు. ముడియంకు వైసీపీ నుంచి వచ్చిన గిరిజన ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే నలుగురు వైసీపీ వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మరోసారి అదే స్టెప్ తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. ఇక కృష్ణాజిల్లా కోటాలో మంత్రులుగా అవకాశం వస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కూడా ఆశాభావంతో ఉన్నారు. గత విస్తరణ సమయంలో వీళ్లిద్దరూ మంత్రి పదవుల కోసం యత్నించారు.
 

Related Posts