YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వరద గుప్పిట్లో కర్నాటక జిల్లాలు

వరద గుప్పిట్లో కర్నాటక జిల్లాలు

కర్ణాటకలో వరద పరిస్థితి భయాన కంగానే ఉంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలోనే కొనసాగుతున్నాయి. బెళగావి, కొడగు జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగానే ఉంది. బాగల్కోడ్, విజపుర, రాయచూర్, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, యాద్గిర్, శివమొగ్గ, చిక్మగుళూరు జిల్లాల్లో జలవిలయం కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కేరళలో 40 మంది మృతిఅటు వరదలు, వర్షాలు సృష్టిస్తున్న బీభత్సంతో కేరళ అతలాకుతలమవుతోంది. అనేక గ్రామాలు నీటమునిగాయి. లక్షలాది ప్రజలు సర్వం కోల్పోయి అల్లాడిపోతున్నారు. కొండచరియలు విరిగిపడి పలువురు గల్లంతయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం పరిస్థితులు గతేడాది వచ్చిన భారీ వరదలను గుర్తుకు తెస్తున్నాయి. భారీ వరదలకు తోడు కొండ చరియలు విరిగిపడు తుండటంతో.. వర్షాల కారణంగా దాదాపుగా 50కి పైగా చనిపోయారని సమాచారం.కర్ణాటక, కేరళల్లోని తీర ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.అంతకంతకూ పెరుగుతున్న వరదల కారణంగా కర్ణాటకలో చాలా ప్రాంతాలు అతలాకుతలం కాగా రహదారులు నదులను తలపిస్తున్నాయి. 

Related Posts