YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఆచి తూచి అడుగులు వేసే వేస్తున్న జేడీ

 ఆచి తూచి అడుగులు వేసే వేస్తున్న జేడీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జేడీ లక్ష్మీనారాయణ సమర్ధత కలిగిన పోలీస్ అధికారిగా సినిమా స్టార్ ని మించిన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ ఇమేజ్ ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో రాణించాలనుకున్నారు. అందుకే సీబీఐ డైరెక్టర్ గా తన పదవీ కాలం ఇంకా ఏడేళ్ళు ఉండగానే స్వచ్చందంగా తప్పుకుని రాజకీయ ప్రవేశం చేశారు. జనసేన నుంచి విశాఖ ఎంపీగా బరిలోకి దిగి జేడీ లక్ష్మీనారాయణ గట్టి పోటీనే ఇచ్చారు. జనసేన ఉనికి ఎక్కడా లేని వేళ ఏకంగా రెండు లక్షల 80 వేళ పై చిలుకు వోట్లు సాధించి జేడీ తానేంటూ రుజువు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు దూరమవుతూ వచ్చారు. ఇపుడు ఆయన బీజేపీ గూటికి చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. జేడీ లక్ష్మీనారాయణతో పాటు విశాఖకు చెందిన పలువురు కీలక జనసేన నేతలు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. అంటే జేడీ లక్ష్మీనారాయణ విశాఖ మూలాలను వదలకుండానే బీజేపీలో చేరుతున్నారని తెలుస్తోంది.విశాఖ రాజకీయాల్లో బీజేపీకి గ్లామర్ కలిగిన నేత ఎవరూ లేరు. అన్న గారు కూతురుగా పురంధేశ్వరిని ప్రొజెక్ట్ చేసినా నిన్నటి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు. అదే జేడీ లక్ష్మీనారాయణ విషయానికి వస్తే ఆఖరి నిముషంలో రంగంలోకి దిగినా సత్తా చాటారు. పైగా ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉంది. బలమైన కాపు సామజికవర్గం వెన్నుదన్నుగా ఉంది. యువకుల్లో ఫాలోయింగ్ కూడా ఉంది. దాంతో జేడీ లక్ష్మీనారాయణని పార్టీలోకి తీసుకుని విశాఖ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. జేడీ సైతం జనసేనలో తనతో పాటు నడచిన వారిని తీసుకుని కాషాయ కండువా కప్పుకోబోతున్నారని అంటున్నారు. విశాఖ దక్షిణం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన గంపల గిరిధర్ తో పాటు, ఉత్తరం, తూర్పు నుంచి పెద్ద ఎత్తున జనసేన నాయకులను కలుపుకుని జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరబోతున్నారు. ఇదంతా భవిష్యత్తు వ్యూహంగా చెబుతున్నారు. జేడీని వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా నిలబెట్టడానికి పూర్వరంగంగానే ఆయనకు కీలమైన బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.జేడీ లక్ష్మీనారాయణ వంటి నేత బీజేపీలోకి వస్తే పార్టీకి కొత్త ఊపు వస్తుందండంలో సందేహం లేదు. అయితే ఎక్కడో అనంతపురం జిల్లాకు చెందిన ఆయన్ని విశాఖలో రాజకీయం చేయమంటేనే స్థానికి బీజేపీ నేతలకు ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. జేడీని రాయలసీమ జిల్లాలలో పార్టీ అభివ్రుధ్ధి కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని కూడా సూచనలు చేస్తున్న వారు ఉన్నారు. అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా జేడీ లక్ష్మీనారాయణ అందరి వాడని తాజా ఎన్నికలు రుజువు చేశాయని, అందువల్ల ఆయన విశాఖ ను వీడిపోరని, ఇక్కడ నుంచే తన వాణిని వినిపిస్తారని అంటున్నారు జేడీ అనుచరులు, విశాఖలో జేడీ కనుక బీజేపీలో చేరితే జనసేనకు మిగిలేది కూడా పెద్దగా ఎవరూ ఉండరని అంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ తో కలసి బీజేపీలో చేరేందుకు చాలా మంది జనసేన నాయకులు ఆసక్తిని చూపించడంతో పాటు, ఆ పార్టీ కార్యకలాపాలు కూడా నిలిచిపోవడంతో ఇపుడు పవన్ పార్టీకి ఉక్కు నగరంలో ఇక్కట్లు తప్పవని అంటున్నారు. మొత్తానికి జేడీ రాక బీజేపీకి ప్లస్ అయితే జనసేనకు భారీ నష్టంగా మారుతోంది. కానీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం తాను జనసేన వీడేది లేదని చెబుతున్నారు.

Related Posts