YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 

Highlights

 

  • 24 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
  • 25న శ్రీరామనవమి, 
  • 28న హనుమత్సేవ, 
  • 30న కల్యాణోత్సవం
  • 31న రథోత్సవం, 
  • ఏప్రిల్‌ 2న చక్రస్నానం 
  • బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు
  • బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లు ఆవిష్కరణ
  • తితిదే  ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు 


కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఈ నెల  24 నుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, బుక్‌లెట్లను  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ...బ్రహ్మోత్సవాల్లో 25న శ్రీరామనవమి, 28న హనుమత్సేవ, 30న కల్యాణోత్సవం,  31న రథోత్సవం,  2న చక్రస్నానం జరుగనున్నాయని చెప్పారు. ఇందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం చలువపందిళ్లు, బ్యారీకేడ్లు, క్యూలైన్లు, కల్యాణం కోసం వేదిక తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయం, పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద శోభాయమానంగా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని, స్వాగత ఆర్చిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్చి 30వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశముందని, భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందుల లేకుండా కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేయాలని సివిఎస్‌వోకు సూచించారు. కల్యాణం రోజు 3 లక్షల తాగునీటి ప్యాకెట్లను అందించాలని, 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగినంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. వేదిక ఇరువైపులా అన్నప్రసాద వితరణకు 200 కౌంటర్లు ఏర్పాటుచేయాలన్నారు. భక్తులకు సమాచారం, సూచనలిచ్చేందుకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రామాయణ సందేశాన్ని తెలిపే భక్తి ఆధ్యాత్మిక పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని, వాహనసేవల్లో మెరుగైన కళాబృందాలను ఏర్పాటు చేయాలని టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ అధికారులను ఈవో ఆదేశించారు.  భక్తులకు వైద్యసేవలందించేందుకు మందులు, తగినంతమంది సిబ్బందిని అందుబాటులో  ఉంచుకోవాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు 1000 మంది శ్రీవారి సేవలకులను ఆహ్వానించాలన్నారు.సమావేశంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఆరోగ్యశాఖాధికారి డాశర్మిష్ట, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌,డిప్యూటీ ఈవో(జనరల్‌) శ్రీమతి గౌతమిలు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు :
25వ తేదీ(ఆది) ధ్వజారోహణం(ఉ.9.03 గం|.లకు) పోతన జయంతి, శేషవాహనం.
26 వ తేదీ 8(సోమ)  వేణుగాన అలంకారం- హంస వాహనం
27వ తేదీ (మంగళ) వటపత్రసాయి అలంకారం-సింహ వాహనం
28వ తేదీ(బుధ)  నవనీతకృష్ణ అలంకారం -హనుమంత సేవ
29వ తేదీ(గురు)మోహినీ అలంకారం- గరుడసేవ
30వ తేదీ(శుక్ర)  శివధనుర్భాణ అలంకారం 
శ్రీ సీతారాముల కల్యాణం(రా.8 గం.లకు), గజవాహనం.
31వ తేదీ8(శని)- రథోత్సవం
01వ తేదీ(ఆది)-కాళీయమర్ధన అలంకారం-అశ్వవాహనం
02వ తేదీ(సోమ)- చక్రస్నానం   
ధ్వజావరోహణం(సా.5.30 గం.)
03వ తేదీ(మంగళ) పుష్పయాగం(సా.5 గం.).

Related Posts