Highlights
- బరువును ఆపలేకనే
- కంటైనర్ డ్రైవర్, క్లీనర్ సురక్షితం
వాహనాల్లో ఓవర్ లోడ్ ఎంత ప్రమాకరమో మరో సారి రుజువైంది. అత్యాశకుపోయి పరిమితికి మించి అధిక బరువులతో కూడా వాహనాలు రోడ్ పైకి వల్ల ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఓ కంటైనర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. హెవీ లోడ్ తో ఉన్న కంటైనర్ బ్రిడ్జి మీదకు రాగానే ధడెల్ మంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బరువును బ్రిడ్జి ఆపలేకనే ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన ఘటన.. వాహనం బ్రిడ్జిపైకి రాగానే..ఆ బ్రిడ్జి మధ్యలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో కంటైనర్ బయటకు తీశారు.