Highlights
- మూడోవది ఎంఐఎంకి ఛాన్స్
- రాజ్యసభకు అజారుద్దీన్..?
తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలబలాలు చూస్తే రెండు రాజ్యసభ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
మూడవ స్థానాన్ని టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం సహాయంతో గెలుచుకునే అవకాశం ఉంది. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో 7 గురు పార్టీ ఫిరాయించారు. మరో ఇద్దరు సభ్యులు మృతి చెందారు. అయితే ఈ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వారు గెలుపొందారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ కు 12 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. అయితే ఈ సంఖ్యతో రాజ్యసభ సీటును కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పరిశీలనలో అజారుద్దీన్, రవీంద్ర నాయక్, గూడూరు నారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి , షబ్బీర్అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయినట్టు సమాచారం.