యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీజీఎఫ్)లు కలిసి మంగళవారం సంచలన నిర్ణయం ప్రకటించాయి. మహిళా టీ20 క్రికెట్ కూడా ఈ నిర్ణయాన్ని సమ్మతించడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ రావడం ఖాయమైపోయింది. బర్మింగ్‌హామ్ వేదికగా 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్‌ను ప్రవేశపెట్టడమే ముఖ్య ఉద్దేశ్యం. ఐసీసీ సీఈఓ మాట్లాడుతూ.. ఇదొక చారిత్రక ఘటనగా మిగిలిపోతుంది. విశ్వవ్యాప్తంగా క్రికెట్‌లో ఇదొక మైలురాయి. రోజురోజుకూ మహిళా క్రికెట్‌లో అభివృద్ధి గమనిస్తూనే ఉన్నాం. ఎన్నాళ్లుగానో అనుకుంటున్నట్లుగా కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ ను మళ్లీ చేర్చడానికి చక్కటి అవకాశం దొరికింది' అని వెల్లడించారు. బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 27జులై నుంచి ఆగష్టు 7వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. 4వేల 500మంది అథ్లెట్లు 18క్రీడల్లో పాల్గొననున్నారు. 1998 తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఆడటం ఇదే తొలిసారి. ఇన్ని సంవత్సరాల తర్వాత క్రికెట్‌ను ఈ ఈవెంట్లో చేర్చడమనేది చాలా గొప్ప విషయమంటూ ప్రముఖులంతా కొనియాడారు. క్రికెట్ మ్యాచ్‌ల బాధ్యతలు, ప్లేయర్ల బాధ్యతలు అన్నీ కామన్వెల్త్ గేమ్స్ మేనేజ్‌మెంటే చూసుకుంటుంది.