YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇక స్మార్ట్ ఫోన్ లు చౌక 

Highlights

  • రూ. 18,900కే శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రో
ఇక స్మార్ట్ ఫోన్ లు చౌక 

కొత్త స్మార్ట్ ఫోన్ ల ధరలు మరింత తగ్గనున్నాయి. మరో వారం రోజుల వ్యవధిలో 7 స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.శాంసంగ్ , నోకియా, వీవో తదితర స్మార్ట్ ఫోన్ లపై 15 నుంచి 30 శాతం వరకూ తగ్గింపును ప్రకటించనున్నాయని మార్కెట్ వర్గాల కధనం.శాంసంగ్ జే 7 మ్యాక్స్ ధర రూ. 3 వేలు తగ్గి రూ. 11,900కు లభించనుంది. నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హీలియో పీ20 ప్రాసెసర్, 5.7 అంగుళాల డిస్ ప్లే, 13/13 ఎంపీ కెమెరాలు దీని ప్రత్యేకత. వీవో వీ7 ప్లస్ రూ. 2 వేల డిస్కౌంట్ తో రూ. 19,990కు అందుబాటులోకి రానున్నాయి. 24 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ దీని ప్రత్యేకతలు.ఇన్ఫినిక్స్ జీరో 5 ధర రూ. 2 వేలు తగ్గి రూ. 15,999కి దిగిరానుంది. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఫోన్ పై, హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడి కొనుగోలు చేస్తే, మరో 10 శాతం రాయితీ లభిస్తుంది. 5. అంగుళాల స్క్రీన్, 12/13 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.నోకియా 6 ధర రూ. 1,500 తగ్గి రూ. 13,499కి లభించనుంది. 3 జీబీ ర్యామ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8. ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 5.5 అంగుళాల స్క్రీన్ ఉంటాయి.వివో వై53 ధర రూ. 500 తగ్గి రూ. 8,499కి మార్కెట్లోకి రానుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో సిస్టమ్ పై పనిచేసే ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 16 జీబీ మెమొరీ, 8/5 ఎంపీ కెమెరాలు ఉంటాయి.ఇన్ఫినిక్స్ నోట్ 4 ధర రూ. 1000 తగ్గి రూ. 7,999కి రానుంది. ఇది కూడా ఫ్లిప్ కార్ట్ లోనే లభిస్తుంది. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ, 13/8 ఎంపీ కెమెరాలున్నాయి.


 

Related Posts