YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రేసులో ముగ్గురు తెలుగు తమ్ముళ్ళు..

Highlights

  • ఏపీకి  మూడు రాజ్యసభ స్థానాలు
  • టీడీపీకి రెండు, వైకాపాకు ఒకటి ఖాయం
  • సీఎం రమేష్ డౌట్ ..?
  • వార్ల రామయ్యకు  లక్..?
  • బీదా మస్తాన్ కు ఛాన్స్..?
  • కసరత్తు చేస్తున్న చంద్రబాబు
రేసులో ముగ్గురు  తెలుగు తమ్ముళ్ళు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతుండడంతో ఆయా సీట్ల కోసం తెలుగు తమ్ముళ్లు తమ బాబాలను పరిక్షఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానవర్గానికి  అభ్యర్థుల ఎంపికపై సమస్యగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం మూడు స్థానాలకు ఎన్నిక జరగనుండగా, ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల సంఖ్య ప్రకారం.. టీడీపీకి రెండు, వైకాపాకు ఒకటి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక తెదేపా  తరఫున సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ ల పేర్లను తుది దశ పరిశీలనకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.

మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్లమెంట్ లో ఆయన చూపించే దూకుడు, ప్రత్యేక హోదాపై నిరసనలు మరింత జోరుగా తెలియజేయాల్సిన వేళ, రమేష్ వంటి యువనేత ఉంటే బాగుంటుందని చంద్రబాబు భావిస్తుండటంతో ఆయనకు మరో చాన్స్ ఖాయంగా తెలుస్తోంది. ఇక మరో స్థానానికి ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఓ దశలో సీఎం రమేష్ బదులు వీరిద్దరికే సీట్లను కేటాయిస్తారని ప్రచారం జరిగినా, ప్రస్తుతం ఇద్దరిలో ఒకరికి మాత్రమే చాన్స్ లభించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో  సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ లలో రాజ్యసభలోకి కాలు పెట్టే ఇద్దరు అదృష్టవంతులు ఎవరో, దురదృష్టవంతుడిగా మిగిలేది ఎవరో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగితే, మూడో స్థానాన్ని సైతం కైవసం చేసుకోవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మూడో అభ్యర్థిని పోటీకి దింపాలని, ఆపై జరిగేది చూద్దామని అధినేతకు చెబుతున్నారు. అదే జరిగితే, ఏకగ్రీవం స్థానంలో ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు తొలి ప్రాధాన్యతా ఓట్లు విజయానికి సరిపడా తెచ్చుకోలేకుంటే, రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం అవుతాయి. ఇక చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికకు మొగ్గుచూపి ఇద్దరినే బరిలో ఉంచుతారా? లేక పోటీకే సై అంటారా అన్నది వేచి చూడాలి.ఈ పరిస్థితుల్లో  సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ లలో రాజ్యసభలోకి కాలు పెట్టే ఇద్దరు అదృష్టవంతులు ఎవరో, దురదృష్టవంతుడిగా మిగిలేది ఎవరో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో  సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ లలో రాజ్యసభలోకి కాలు పెట్టే ఇద్దరు అదృష్టవంతులు ఎవరో, దురదృష్టవంతుడిగా మిగిలేది ఎవరో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది.

Related Posts