YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీగా తగ్గిన ఎరువుల ధరలు

భారీగా తగ్గిన ఎరువుల ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎరువుల తయారీ కంపెనీ ఇఫ్కో తాజాగా రైతులకు తీపికబురు అందించింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. డీఏపీ సహా వివిధ ఫెర్టిలైజర్స్ ధరను బస్తాకు రూ.50 తగ్గించింది.  ఎరువుల ధర తగ్గింపు నుంచి అమలులోకి వచ్చింది. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. ‘73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని సంక్లిష్ట ఎరువుల ధరను బ్యా్గ్‌కు రూ.50 తగ్గించాం. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు, వారి వ్యవసాయ ఉత్పాదక వ్యయాలను తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఇఫ్కో ఒక ప్రకటనలో తెలిపింది. ధర తగ్గింపుతో డీఏపీ (50 కేజీల బస్తా) ధర ఇప్పుడు రూ.1,250కు దిగొచ్చింది. ఇదివరకు దీని ధర రూ.1,300గా ఉంది. ఎన్‌పీకే 1 ధర కూడా
రూ.1,250 నుంచి రూ.1,200కు తగ్గింది. ఎన్‌పీకే 2 రేటు రూ.1,210కు దిగొచ్చింది. దీని ధర ఇదివరకు రూ.1,260. ఎన్‌పీ ధర రూ.1,000 నుంచి రూ.950కి తగ్గింది. ఎన్‌పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈయన లక్ష్యానికి అనుగుణంగా, రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఎరువుల ధర తగ్గించామని ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ యూఎస్ ఆవాస్తి తెలిపారు. ఇఫ్కో దేశవ్యాప్తంగా 35,000 కోఆపరేటివ్ సొసైటీల ద్వారా 5 కోట్లకు పైగా రైతులకు సేవలు అందిస్తోంది. ప్రపంచంలోనే అదిపెద్ద ప్రాసెస్‌ డ్ ఫెర్టలైజర్ కోఆపరేటివ్‌గా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.27,852 కోట్లు. దీనికి ఐదు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ కేవలం ఎరువులు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్, రూరల్ మొబైల్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పలు విభాగాల్లోనూ
కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Related Posts