YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వాజ్‌పేయికి రాష్ట్రపతి,ప్రధాని తో సహా నేతలు ఘన నివాళి

వాజ్‌పేయికి  రాష్ట్రపతి,ప్రధాని తో సహా నేతలు ఘన నివాళి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తొలి వర్థంతి సందర్భంగా ఆయనకు బీజేపీ ఘనంగా నివాళులు అర్పించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సహా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వాజ్‌పేయి స్మారకం సదైవ అటల్ వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారికలను కలుసుకుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1924  డిసెంబర్ 25 న మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. మూడు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. 2015లో భారత ప్రభుత్వం వాజ్‌పేయికి అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం అందించింది. నాలుగు దశాబ్ధాల పాటు ఎంపీగా పదిసార్లు పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యేంత వరకూ వాజ్‌పేయి యూపీలోని లక్నో నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ఆయన స్మృత్యర్థం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ సమీపంలో రూ.10.51 కోట్ల వ్యయంతో సదైవ అటల్ ను నిర్మించారు. అటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ 1.5 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించింది. . నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వాజ్‌పేయీ గత సంవత్సరం ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన 1998-2004 మధ్య ప్రధానిగా సేవలందించారు.

Related Posts