YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

విద్యార్థులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్లు

Highlights

  • ఆహార ప్రమాణాలు పెంపు
  • ఇకపై వారానికి ఆరు గుడ్లు 
  • స్కూళ్లకు నల్లా కనెక్షన్లు 
  • రాష్ట్ర విద్య శాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడి
విద్యార్థులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్లు

ఇప్పటివరకు విద్యార్థులకు   అందిస్తున్న ఆహార పరిమాణాన్ని పెంచడానికి ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు.  ప్రధానోపాధ్యాయుల సదస్సులో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ...ఒక్కో విద్యార్థికి ఇప్పటివరకు వారానికి మూడు గుడ్లను అందిస్తుండగా దీనిని రెండింతలు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించామని కడియం చెప్పారు. రాష్ట్రంలోని 23 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకానికి గాను ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. అంతే కాకుండా 7-10 తరగతి విద్యార్థినులకు ఆరోగ్య, పరిశుభ్ర కిట్ల పంపిణీకి యోచన చేస్తున్నట్లు మంత్రి కడియం వెల్లడించారు. అంతేకాక మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సదుపాయం లేని స్కూళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

.
 

Related Posts