పంజాబ్ రాష్ట్రము లోని బంగాల దుంప (ఆలుగడ్డ) పండించే వ్యవసాయ రైతులకు అవసరమైన అన్ని విదాల సహకారం అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బంగాల దుంప పంటకు అవసరమైన విత్తనాలకు నఖిలీ బారిన పడకుండా చర్యలు తీసుకోవడం దీని ప్రదాన ఉద్దేశం.పంజాబ్ రాష్ట్ర మార్కు కలిగిన విత్తనాలను కాకుండా అదేపోలికతో ఇతర రాష్ట్రాలనుంచి బంగాల దుంప విత్తనాలు వస్తుండటం తో రైతాంగం నష్ట పోతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది.దీని వల్ల ఈ రైతులు నష్ట పోతున్నారని నఖిలీల బెడదను తగ్గించేందుకు వీలుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని ఉపయోగించాలని,ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం పంజాబ్ అగ్రి ఎక్సపోర్ట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెంచి గా నియమాయించాలని పంజాబ్ రాష్ట్ర వ్యవసాయం,మరియు సంస్కేమ శాఖ
నిర్నయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ బంగాల దుంప విత్తనా సర్టిఫికేట్ పోగ్రాం లో బాగంగా పంజాబ్ అగ్రి ఎక్స్ ఫోర్ట్ కార్పొరేషన్ వ్యవసాయ ఆదారిత ఐటి పోర్టల్ ద్వారా విత్తనాలను గుర్తించి రైతులకు మేలిమి రకాల విత్తనాలు అందేలా చూస్తుంది.రైతుల యుక్క పూర్తి వివరాలను సాంకేతిక పరిజ్ఞ్యానం తో అనుసందానం చేసి ఎక్కువ దిగుబడి వచ్చే విదంగా రైతులకు సుచాలను చేస్తుంది.దీనిలో బాగంగా పంటకు సంబందించిన పూర్తి సమాచారాన్ని మొబైల్ అప్లికెషన్ ద్వారా డాష్ బోర్డ్ లకు అనుసందానించి రైతులకు పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు. ఒకసారి ఈ పతకం అమలు జరిగితే అధునాతన పద్దతులతో తక్కువ కర్చుతో రైతులు ఎక్కువ లాభలు పొందవచ్చునని పంజాబ్ వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.రాష్ట్రము లో సాలీనా 27 లక్షల మెట్రిక్ టన్నుల బంగాల దుంప ఉత్పత్తవుతుందని దీనిలో 60 నుండి 70 శాతం దేశియ ,అంతర్జాతీయ మార్కెట్లకు సరపరా చేస్తుందని పంజాబ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ మేజేనింగ్ డైరెక్టర్ మంజేట్ బ్రార్ తెలిపారు.బంగాల దుంప రైతులు ఆర్దికంగా నష్ట పోకుండా ఉండడానికి ఈ ఫతకాన్ని అమలు చేస్తున్నామని ,ఈ విధానం వల్ల నఖిలీలను నివారించడం తో పాటు రైతాంగానికి నష్టం జరుగకుండా ఉంటుందని ఈ విదానాన్ని వచ్చే సీజన్ నుండి ప్రారంబిస్తామని ఆయన వివరించారు.