Highlights
- 15 నుంచి 28 తేదీ వరకే ఉచితం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ఎపిఎస్ఆర్టీసి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. పడవ తరగతి పరీక్షలు జరుగుతున్నా వేళా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాయతీ బస్సు పాసు కలిగి, పదో తరగతి పరీక్ష హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థులను వారి వారి నివాస ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రం వరకు వెళ్లే వెసులుబాటు కల్పించనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉచిత ప్రయాణం ఈ నెల 15 నుంచి 28 తేదీ వరకు కల్పించనున్నట్లు పేర్కొంది.