YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

బీహెచ్‌ఈఎల్‌లో కొలువులు 

Highlights

  • 918 అప్రెంటిస్‌లు
  • -ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ (ఐటీఐ హోల్డర్స్)
  • మొత్తం ఖాళీల సంఖ్య: 918 
  •  ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 
  • ఈ నెల 20 వ తేదీ వరకు గడువు 
  • 23 న షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా 
  • 26 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • పదోతరగతి + ఐటీఐ ఉత్తీర్ణత
  • ఇంటర్వూ ద్వారా ఎంపిక
  • -శిక్షణ కాలంలో స్టయిఫండ్
బీహెచ్‌ఈఎల్‌లో కొలువులు 

దేశంలో అతిపెద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటు చేశారు. మహారత్న హోదా కలిగిన ఈ సంస్థకు చెందిన తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ (ఐటీఐ హోల్డర్స్) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఎస్సీ - 19 శాతం, ఎస్టీ - 1 శాతం, ఓబీసీలకు 27శాతం, పీహెచ్‌సీలకు నాలుగు శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ (ఐటీఐ హోల్డర్స్) కు  918  ఖాళీలున్నాయి. ఫిట్టర్-330, వెల్డర్ (జీ అండ్ ఈ)-240, టర్నర్-25, మెషినిస్ట్-35, ఎలక్ట్రీషియన్-75, వైర్‌మ్యాన్-20, ఎలక్ట్రానిక్ మెకానిక్-15, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-20, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్-20, డీజిల్ మెకానిక్-15, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)-15, షీట్ మెటల్ వర్కర్-15, ప్రోగ్రామ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా)-50, ఫార్గర్ అండ్ హీట్ ట్రీటర్-10, కార్పెంటర్-15, ప్లంబర్-15, ఎంఎల్‌టీ పాథాలజీ-3 ఖాళీలు ఉన్నాయి.  గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత లేదా ఎన్‌సీటీవీటీ నుంచి జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ప్లంబర్ ట్రేడ్‌కు 10+2 విధానంలో ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై, ఏడాది ఐటీఐ పూర్తిచేసిన వారు అర్హులు. 2018, ఏప్రిల్ 1 నాటికి 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


 ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఏసీ & రిఫ్రిజిరేషన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) ట్రేడ్‌లకు నెలకు రూ. 11,129/-ల స్టయిఫండ్ ను చెల్లిస్తారు. అదే  వెల్డర్ (జీ అండ్ ఈ), డీజిల్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఫార్గర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ప్లంబర్ ట్రేడ్‌లకు నెలకు రూ. 9,892/-, ఎంఎల్‌టీ పాథాలజీ ట్రేడ్ అభ్యర్థులకు నెలకు రూ. 8,656/- చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ వెబ్‌సైట్: www.bheltry.co.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  

Related Posts