YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

వైసీసీ, టీడీపీ పంతం...

వైసీసీ, టీడీపీ పంతం...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి సంబంధించిన పనులు చక్కబెట్టుకోవాలని భావించిన సీఎం జగన్... ఇప్పుడు రూటు మార్చినట్టు కనిపిస్తోందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. పీపీఏల రద్దు, పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై వైసీపీ, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. వీటి విషయంలో వెనక్కి తగ్గొద్దని వైసీపీ గట్టిగా నిర్ణయించుకోగా... వీటి జోలికి వెళ్లొద్దని బీజేపీ నేతలు బాహాటంగానే ఏపీ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఈ విషయంలో ఎవరి పంతం వారిదే అన్నట్టుగా ఉంది. కీలకమైన ఈ అంశాల్లో వైసీపీ వెనక్కి తగ్గేలా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న బీజేపీ ప్రయత్నాలను ఉపేక్షించొద్దని నిర్ణయించుకున్న సీఎం జగన్... పోలవరం రివర్స్ టెండరింగ్‌కు తేదీ కూడా ఖరారు చేశారు. దీంతో కీలకమైన అంశాల విషయంలో బీజేపీని ఢీ కొట్టడానికే వైసీపీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పలు అంశాల్లో బీజేపీతో పాటు టీడీపీ చేస్తున్న వాదనలు కూడా ఓకే రకంగా ఉండటం కూడా వైసీపీకి ఇబ్బందికి మారిందనే టాక్ ఉంది. ఏదేమైనా... పోలవరం రివర్స్ టెండరింగ్ సహా పలు కీలక అంశాలపై ముందుకే సాగాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఏ మలుపు తీసుకుంటాయో అనే ఉత్కంఠ నెలకొంది.

Related Posts