YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం ఏదో జిమ్మిక్కు :సుజనా

ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం ఏదో జిమ్మిక్కు :సుజనా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జగన్ సర్కార్ నిర్ణయాలను తప్పుబట్టారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం ఏదో జిమ్మిక్కు చేయాలని చూస్తున్నారని విమర్శించారు ఇసుక పాలసీ నిలిపివేయడం, ఉపాధి హామీ పనులు ఆగిపోయాయన్నారు సుజనా. ఏపీ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని.. వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జగన్ ప్రాజెక్టుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న చట్టంతో పరిశ్రమలు రావని వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన సుజనా సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై వైసీపీ సర్కార్ కక్ష సాధిస్తోందన్నారు సుజనా. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని.. కానీ ఇలా కక్ష సాధించడం సరికాదన్నారు. చంద్రబాబు ఎన్డీయే విధానాలను విభేదించినట్లుగానే వైసీపీ వ్యవహరిస్తే బావుండేదన్నారు. ఇక ఏపీలో వరద రాజకీయంపైనా స్పందించారు. వరదల పేరుతో వైసీపీ, టీడీపీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు పార్టీలు వరద బాధితులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వరదల నియంత్రణ, సహాయక చర్యలపై వైసీపీకి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణకు వరద వస్తుందని కర్ణాటక ప్రభుత్వం ముందే సమాచారం ఇచ్చిందని.. ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేకపోయిందని విమర్శించారు బీజేపీ ఎంపీ. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. 2024 ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు

Related Posts