Highlights
- రూ.2కోట్ల వరకు డిమాండ్
- ఏప్రిల్ 26న కాలా విడుదల
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన 'కాలా' చిత్రంలో నటించిన శునకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ శునకం పేరు మణి కాగా.. దానిపై రజనీ చెయ్యి పడిందని, అందుకోసం ఈ శునకాన్ని తమకు అమ్మవలసిందిగా మలేషియాకు చెందిన రజనీ అభిమాని ఒకరు రూ.2కోట్లు ఇస్తానని బేరమాడాడట. అయితే మణి యజమాని సిమన్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట.వాస్తవానికి తనకు మణి రోడ్డుపై దొరికిందని, ఆదుకొనే వారు లేక చలికి ఒణుకుతుండగా చేరదీసి నటనపై శిక్షణ ఇచ్చానని.. సొంత బిడ్డలా మణిని పెంచుకున్నానని, దానిని అమ్మాలనే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారట. ఇదిలా ఉంటే 'కాలా' సినిమా తర్వాత మణికి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.