YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దళిత బాలికపై దాడి : గ్రామ పెద్దపై కేసు

 దళిత బాలికపై దాడి : గ్రామ పెద్దపై కేసు

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేపీదొడ్డిలో ప్రేమించుకున్నారన్న కారణంతో మైనర్లపై గ్రామపెద్ద అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. గ్రామపెద్ద లింగప్పపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలికను ప్రేమించిన యువకుడిపైనా పోక్సో చట్ట కింద కేసు పెట్టారు. ఈ ఘటనపై గ్రామంలో విచారణ జరుపుతున్న పోలీసులకు మరికొందరిపైనా కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు. గ్రామానికి చెందిన బాలికకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే బాలికకు మైనార్టీ తీరకపోవడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఇద్దరి వెతికి పట్టుకుని తీసుకొచ్చారు. గ్రామంలో పంచాయతీ పెట్టి గ్రామపెద్ద లింగప్ప అందరి ముందూ బాలికతో పాటు యువకుడిని తీవ్రంగా కొట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో ప్రజాసంఘాలు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts