YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కార్తికి ఢిల్లీ హైకోర్టులో కాస్త ఊరట 

Highlights

  •  20 వరకు కార్తికు  అరెస్టుల్లేవు 
కార్తికి ఢిల్లీ హైకోర్టులో కాస్త ఊరట 

 కార్తి చిదంబరానికిఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో కార్తి చిదంబరం సీబీఐ కస్టడీని పాటియాలా హౌజ్ సీబీఐ ప్రత్యేక కోర్టు మరో మూడు రోజుల పాటు పొడగించింది. కార్తి చిదంబరంను మరో ఆరు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. దీనిపై ఇరు వాదనలు విన్న కోర్టు...సీబీఐ కస్టడీని మూడు రోజులు పొడగిస్తూ రూలింగ్ ఇచ్చింది. కానీ తాజాగా మనీలాండరింగ్ కేసులో ఈ నెల 20 వరకు కార్తి చిదంబరంను  అరెస్టు చేయరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించింది. కార్తికి స్పెషల్ సీబీఐ కోర్టు బెయిలును మంజూరు చేసినట్లయితే, హైకోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు ఈడీ కార్తిని అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. 

Related Posts