గత వారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన రెండు కిడ్నీలూ పనిచేయడం లేదని, గుండె పనితీరు మందగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఈసీఎంఓ (ఎక్స్ ట్రా కార్పొరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చి, ఐసీయూలో చికిత్సను అందిస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి.