YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

లైక్స్..రేటింగ్స్ కు తప్పుడు ప్రచారం 

Highlights

  • ప్రమాదం జరిగినట్టు దుష్ప్రచారం 
  • చట్టపరమైన చర్యలు అవసరం 
  • ఓ అసత్య వార్తపై శ్రీకాంత్ ఫిర్యాదు 
లైక్స్..రేటింగ్స్ కు తప్పుడు ప్రచారం 

కల్పిత వార్తలు, రూపొందిస్తున్న వీడియోలు ప్రజల మనోభావాలకు విఘాతం కలిగిస్తున్నాయి. ప్రాణాలతో ఉన్న వారిని చనిపోయినట్లు.. ఆరోగ్యంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితిలో ఉన్నారని.. ఇలా వార్తలు సృష్టిస్తూ సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం చేయడం దారుణం. వాయిస్ ఓవర్‌తో కూడిన వీడియోలతో  లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం అసత్య వార్తలను ప్రచారం చేయడం చాలా తప్పు.  ఆరోగ్యంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితిలో ఉన్నారని వార్తలను సృష్టించేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ తరహా  నిరాధారమైన వార్తల విషయంలో చాలా మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే  హీరో శ్రీకాంత్ ఓ అసత్య వార్తకు సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.శ్రీకాంత్‌కు ప్రమాదం జరిగిందంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌లో తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో శ్రీకాంత్ ఈ వార్తను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానెల్ వాళ్లు తమ లైక్స్ కోసం, చందాదారుల కోసం ఇలా దిగజారుతారా?అంటూ మండిపడ్డాడు. 


బెంగళూరు షూటింగ్‌లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు ప్రమాదం అయ్యిందట కదా?, ఎలా ఉంది? అంటూ ఫోన్‌ కాల్స్ రావడం మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ఉన్న మా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలిసి, కంగారుపడి ఫోన్స్ చేశారు. అలాగే అభిమానుల నుంచి కూడా వరుస ఫోన్స్ వస్తున్నాయి. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి నిరాధారమైన వార్తలను  రాయడం విరమించుకోవాలన్నారు. ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కూడా సీరియస్‌గా తీసుకుంటుంది. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైమ్‌ ఎస్పీ రామ్మోహన్ రావుకు ‘మా’ ద్వారా ఫిర్యాదు చేశాం’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

Related Posts