Highlights
- విదేశాల్లో ఉన్ననాటికీ నోటీసులు జారీ
- నకిలీ పత్రాలు సమర్పించి
- నటి సింధు మీనన్ సోదరుడు
- మనోజ్ కార్తికేయన్ వర్మా,నాగశ్రీ శివన్నలు అరెస్టు
నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసి రుణం తీసుకున్నారని ప్రముఖ బహుబాష నటి సింధు మీనన్ సింధు మీనన్ మీద చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సింధు మీనన్ ను విచారణకు హాజరుకావాలని బెంగళూరు నగర పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసలేంజరిగిందంటే..ఆమె సోదరుడు మనోజ్ కార్తి కేయన్, నాగశ్రీ శివన్న, సుధా రాజశేఖర్ కలిసి నకిలీ పత్రాలపై బెంగళూరులోని బ్యాంకో ఆఫ్ బరోడలో రూ. 30 లక్షలు రుణం తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.బ్యాంకు మేనేజర్ రమేష్ ఫిర్యాదు మేరకు ఆర్ ఎంసీ యార్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్, మరో మహిళ నాగశ్రీ శివన్నల ను విచారించిన పోలీసులు అనంతరం వాళ్ళను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ శనివారం మీడియాకుతెలిపారు సుధా రాజశేఖర్ కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ అన్నారు.