Highlights
- ఆ ఆలయంలో ప్రధాన దేవుడు శకునే
- మహాభారతంలో అత్యంత క్రూరమైన పాత్ర
సనాతన ధర్మం ప్రకారం గుణం ఆధారంగా వ్యక్తిని చూస్తారు. కాబట్టి కౌరవులు మేనమామ శకుని విషయంలో ఈ అభిప్రాయం సరైందే. మహాభారతంలో అత్యంత క్రూరమైన పాత్ర. బయటకు దుష్ట బుద్ధి కనిపించినా ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి.ఆయనలోని ఉత్తమ లక్షణాలు వల్ల ఓ ఆలయం నిర్మించి ఆరాధిస్తున్నారు. కేరళలోని కొల్లమ్ జిల్లాలో మాయమ్ కొట్టు మల్చేరు మలందా ఆలయంలో గాంధార యువరాజు శకుని పూజలందుకుంటున్నాడు.
ఆ ఆలయంలోని సింహాసనాన్ని శకుని ఉపయోగించినదిగా భావించి పూజిస్తుంటారు. అయితే ఇక్కడ ఎలాంటి సంప్రదాయ లేదా తాంత్రిక పూజలను నిర్వహించరు. కేవలం కొబ్బరికాయ, సిల్క్, టోడీ అనే ద్రావణం (విస్కీ, పంచదార, నీళ్లు) అర్పిస్తారు. మహాభారత యుద్ధ సమయంలో తన మేనల్లుళ్లు కౌరవులతో కలిసి శకుని దేశమంతా పర్యటిస్తాడు. అయితే కొల్లం చేరుకునేసరికి కౌరవులు ఆయుధాల విభజన జరుగుతుంది.
అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని పకుతేశ్వరమ్‌గా పిలుస్తున్నారు. తర్వాతి కాలంలో ఇది పవిత్రేశ్వరంగా మారింది. యుద్ధం ముగిసిన తర్వాత శివుని అనుగ్రహం సంపాదించి మోక్షం పొందడానికి శకునికి ఇక్కడకు చేరుకుని పూజలు చేశాడట. ఈ ఆలయంలో ఇంకా భువనేశ్వరీ దేవి, కిరాత మూర్తి, నాగరాజు విగ్రహాలు కూడా ఉన్నాయి.
మళయాల క్యాలెండర్ ప్రకారం మకర నెల (జనవరి- ఫిబ్రవరి)లో వినోదం కూడిన మలక్కుడ మహోలస్వామ్ అనే పండుగను నిర్వహిస్తారు. ద్వాపర యుగంలో మానవీకరణమైన వ్యక్తిగా శకుని గురించి మహాభారతంలో పేర్కొన్నారు. అంతే కాదు తన అభిమాన మేనళ్లుడు దుర్యోధనుడికి తోడుగా నిలిచాడు.