యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రిలయన్స్ జియో తన జియో గిగాఫైబర్ సేవలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఇటీవలే జరిగిన ఆ సంస్థ 42వ ఏజీఎంలో జియో గిగాఫైబర్ వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఈ సేవలకు గాను వినియోగదారులకు రూ.700 మొదలుకొని రూ.10వేల వరకు నెలవారీ ప్లాన్లు లభ్యం కానున్నాయి. ఇక ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ వరకు లభ్యం కానుంది. అయితే జియో గిగాఫైబర్ సేవలను పొందేందుకు ఎవరైనా సరే.. కింద తెలిపిన పద్ధతిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...
స్టెప్ 1: జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్
స్టెప్ 2: వినియోగదారులు తమ చిరునామా వివరాలను ఎంటర్ చేయాలి.
స్టెప్ 3: పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్ వివరాలను ఇవ్వాలి.
స్టెప్ 4: మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి.
స్టెప్ 5: రిలయన్స్ జియో ప్రతినిధి వినియోగదారులను సంప్రదించి వివరాలను సరిచూసుకుని జియో గిగాఫైబర్ కనెక్షన్ ఇస్తారు.