YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..తప్పిన పెనుప్రమాదం
దాదాపు 20 గంటల పాటు భారీ ఎత్తున ఎగిసిపడిన అగ్నికీలలు
సహాయక చర్యల్లో ఐదు అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది

రామచంద్రాపురం/అమీన్‌పూర్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోని బండలగూడ గ్రామంలో గల అగ ర్వాల్ రబ్బర్ గోడౌన్‌లో బుధవారం అర్థరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో అక స్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో టైర్లు ఉం డ డంతో మంటలు క్షణాల్లోనే తీవ్రరూపం దాల్చా యి. స్థానికంగా ఉన్న అగ్ని మాపక యంత్రాలు వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏమాత్రం అదుపులోకి రాలేదు. దీంతో దగ్గర్లో ఉన్న అన్ని అగ్నిమాపక కేంద్రా లకు సమాచారం అందించారు. పటాన్‌చెరు,  బిహెచ్‌ఇఎల్, మాదా పూర్ ఐదు అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది ఆరు యంత్రాల సహాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బుధవారం అర్థరాత్రి ఒంటి గంటకు మొదలైన మంటలు గురువారం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన రబ్బరు పరిశ్రమకు అతిసమీపంలో రెండు కెమికల్ పరిశ్రమలు ఆనుకుని ఉండడమే కాకుండా దగ్గర్లో జన నివా సాలు ఉన్నాయి. క్షణక్షణానికి ప్రమాద తీవ్రత పెరగడం, మంటలు 30మీటర్ల ఎత్తులో ఎగిసి పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గుర య్యారు. అగ్నిమాపక యంత్రాలు సంఘ టనా స్థలానికి చేరుకుని ముందస్తుగా పక్కనున్న కెమి కల్ పరిశ్రమకు మంటలు వ్యాపించకుండా తగి న చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎసిపి రవికుమార్ : అగర్వాల్ రబ్బర్ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదం జరిగిన తీరును మియాపూర్ ఎసిపి రవి కుమార్ తో పాటు రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్ రాం చందర్‌రావు పరిశీలించారు. సంఘటనా స్థలాని కి చేరకుని పరిశ్రమ యాజమన్యంతో ఆరాతీశా రు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రమాదానికి కారణం షార్ట్‌సర్కూట్ కావచ్చు నన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Related Posts