YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భూ కబ్జాలో ఇరుక్కున్న కలెక్టర్ 

Highlights

  • అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్ట్
  • 13వ తేదీ బోనెక్కనున్న ఐఏఎస్ 
భూ కబ్జాలో ఇరుక్కున్న కలెక్టర్ 

కర్ణాటకలోని ఉడిపి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి  ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ భూ కబ్జా, భూ స్వాధీనం కేసులో ఇరుక్కుని ఈనెల 13వ తేదీన బోనెక్కనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వయంగా కర్ణాటక భూకబ్జా నిషేద చట్టం కింద ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.న్యాయస్థానం ఆదేశాలు లెక్కచెయ్యకుండా వివరాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. మంగళూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి అరెస్టు వారెంట్ చేరింది. మంగళూరు ఎస్పీ వారెంట్ ను ఉడిపి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. ఉడిపి జిల్లాలోని భూకబ్జా, భూస్వాధీనం విషయంలో పూర్తి వివరాలు సమర్పించడంలో స్థానిక తాలుకా తహసిల్దార్ విఫలం అయ్యారు. కోర్టుకు వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనితో  భూకబ్జా, భూస్వాధీనం విషయంలో సంపూర్ణ వివరాలు కోర్టుకు సమర్పించడంలో విఫలం అయ్యారని ఉడిపి జిల్లా మహిళా కలెక్టర్ కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. 
 

Related Posts