
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సాధారణ తనిఖీల్లో భాగంగా రైల్వే స్టేషన్ లో ఆర్ఫీ ఎఫ్ పోలీసులు సోదాలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మూడు బ్యాగులలో గంజాయి నింపి సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని భోపాల్ తరలించేందుకు సిద్ద మయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులను చూసి కంగారు పడ్డారు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఒడిషా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన షకీల్ కరడా, ఉదయ గిరికి చెందిన సంజిత సించానీలు 30 కిలోల గంజాయిని తరలించేందుకు కొంత సొమ్ము కిరాయిగా తీసుకున్నట్లు మీడియా సమావేశంలో ఆర్పీ.ఎఫ్ . సి.ఐ. కె కె సాహు వెల్లడించారు.