YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ... ఈడీ, సిబిఐలతో దాడి

మోడీ... ఈడీ, సిబిఐలతో దాడి

యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత పి. చిదంబరం.. విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతిచ్చారు. అయితే, ఈ సంస్థ పెట్టుబడులను సేకరించింది చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సంస్థల నుంచేనని, ఈ వ్యవహారంలో దాదాపు రూ.305 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో చిదంబరాన్ని సైతం నిందితుడిగా చేర్చడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడగా, అక్కడ చుక్కెదురయ్యింది. దీంతో చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంతో సీబీఐ వ్యవహరిస్తోన్న తీరుపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పాటు దేశానికి సేవ చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు. దేశానికి దశాబ్దాలుగా చిదంబరం సేవ చేశారని... కేంద్ర ఆర్థిక, హోం మంత్రిగా బాధ్యతలను నిర్వహించారని ప్రియాంక అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆయన నైజమని, కేంద్రం వైఫల్యాలను ఎండగడుతున్నారనే కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కొందరు పిరికిపందల వల్ల నిజాలు మాట్లాడే వారిపై నిందలు పడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. చిదంబరం పట్ల సీబీఐ అవమానకరంగా ప్రవర్తిస్తోందని ప్రియాంక ఘాటుగా విమర్శించారు. ఆయనకు తామంతా మద్దతుగా నిలుస్తామని... ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే ప్రసక్తేలేదని న్యాయం కోసం పోరాడుతామని ప్రియాంక స్పష్టం చేశారు. ‘అత్యున్నంత విద్యావంతుడు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యుడు పి చిదంబరం దేశం కోసం అనేక దశాబ్దాలుగా సేవలు చేస్తున్నారు.. కేంద్ర హోం, ఆర్థిక మంత్రిగా పనిచేశారు.. నిజాలను మాట్లాడటం ఆయన నైజం.. కేంద్రం వైఫల్యాలను ఎండగడుతున్నారనే కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.

Related Posts