Highlights
- ఆ ఇద్దరి మధ్య ఏంలేదు
- గంటా రవితేజ, హీరోయిన్ సాయిపల్లవి ప్రేమపై
- మంత్రి గంటా శ్రీనివాస రావు క్లారిటీ
ఇతరుల జీవితాలపై మచ్చ వేసేలా వార్తలు రాయడం సోషల్ మీడియాకు తగదని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి గంటా తనయుడు గంటా రవితేజ, హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై స్పందించిన మంత్రి తన కుమారుడు రవితేజపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు.
వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని గంటా తేల్చి చెప్పేశారు. అయితే సైపల్లవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇలాంటి విషయాలపై సాధారణంగా స్పందించను కానీ తప్పక క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా గంటా రవితేజ ‘జయదేవ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.