YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీఎంలకు అమెరికా టెన్షన్

సీఎంలకు అమెరికా టెన్షన్

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పన్నెండు రోజుల అమెరికా టూర్ ముఖ్యమంత్రి పళనిస్వామిని భయపెడుతోంది. అమెరికా వెళితే కర్ణాటక తరహాలో తమిళనాడులో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయేమోనన్న ఆందోళన నెలకొని ఉంది. తమిళనాడులో ఎప్పుడు? ఏమైనా జరగొచ్చన్నది గతంలో చూశాం. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి అప్పట్లో అమెరికా పర్యటనలో ఉండగానే అసమ్మతి నేతలు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం కుప్ప కూలిపోయింది.ఇప్పటికే ముఖ్యమంత్రి పళనిస్వామికి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు పొసగడం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో పన్నీర్ సెల్వం దగ్గరగా ఉంటున్నారు. బీజేపీ కూడా పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపుతుంది. ఈపరిస్థితుల్లో తాను అమెరికా వెళితే ఆపరేషన్ స్టార్టవుతుందేమోనన్నది పళనిస్వామి అనుమానం. ఈ నెల 28వ తేదీన పళనిస్వామి విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. అమెరికా, లండన్ వంటి దేశాల్లో పర్యటించి పెట్టుబడులను సమీకరించాలన్న యోచనలో ఉన్నారు.ఈ నెల 28వ తేదీన విదేశీ పర్యటనకు బయలుదేరనున్న పళనిస్వామి వచ్చే నెల 9వ తేదీకి గాని తమిళనాడుకు చేరుకోరు. ఈ పన్నెండు రోజుల్లో పన్నీర్ సెల్వం నుంచి ముప్పు పొంచి ఉందేమోనన్న అనుమానం పళనిస్వామి వర్గీయుల్లో నెలకొని ఉంది. అయినా విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు పళనిస్వామి సిద్ధమయ్యారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకే పళనిస్వామి పర్యటన ఉంటుందని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి.అయితే కర్ణాటక రాజకీయం వేరు. తమిళనాడు రాజకీయం వేరు. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ లో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం కుప్ప కూలింది. కానీ తమిళనాడు పరిస్థితులు వేరు. ఇప్పటికే డీఎంకే శాసనసభలో బలంగా ఉంది. పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా అన్నాడీఎంకేకు లేదు. ఈవిషయం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనే స్పష్టమయింది. దీంతో పళనిస్వామి లోలోపల కొంత ధీమాగానే ఉన్నా పళనిస్వామి కొంప ముంచుతాడేమోనన్న ఆందోళన మాత్రం ఆయనను వదలిపెట్టడం లేదు.

Related Posts