ఆరంభంలో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న మార్కెట్లు లాభాలతో మళ్లాయి. తిరిగి అమ్మకాల ఒత్తడితో సెన్సెక్స్ 44పాయింట్లు నష్టంతో 33,307వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు నష్టంతో 10,226 వద్ద ముగిసింది. మొత్తం మీద దేశీయ మార్కెట్ నష్టాలతో ముగిసాయి. ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. మెటల్, బ్యాంక్స్ వీక్‌తో పాటు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ , అదానీ షేర్లు బాగా నష్టపోయాయి. మారికో, పీటీసీ, పేజ్, కజారియా, జూబిలెంట్ ఫుడ్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ లాభపడగా టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హిందాల్కో, యస్‌బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లా, సన్ ఫార్మా నష్టపోయాయి.