YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కిరణ్ బేడీ కి హైకోర్ట్ లో చుక్కెదురు

 కిరణ్ బేడీ కి హైకోర్ట్ లో చుక్కెదురు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేబేడీ ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదంటూ సింగల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులకు స్టే విధించలేమని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం, పథకాలకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి అధికారం అప్పజెబుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాజ్‌భవన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి ఆర్‌. మహాదేవన్‌ విచారణ జరిపారు. విచారణకు హాజరైన ఇరుతరపు న్యాయవాదుల వాదనల అనంతరం, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి ప్రభుత్వ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ జోక్యం కలుగజేసుకోవడానికి స్టే విధిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కేంద్ర హోం శాఖ తరపున సుప్రీంకోర్టులో అపీలు పిటిషన్‌ దాఖలయ్యింది. అయితే హైకోర్టు బెంచ్‌లో అపీలు చేయకుండా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ కిరణ్‌ బేడీకి వ్యతిరేకంగా సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులకు స్టే విధించాలని కోరింది.ఈ నేపథ్యంలో బుధవారం హైకోర్టు న్యాయమూర్తులు వినీత్‌ కొథారి, కార్తికేయన్‌లతో కూడిన బెంచ్‌
ముందు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ అమన్‌లోహి, పుదుచ్చేరి ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు మాసిలామణిలు హాజరై గట్టిగా వాదించారు. వీరి వాదనల అనంతరం కిరణ్‌ బేడీకి వ్యతిరేకంగా సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులకు స్టే విధించడం సాధ్యం కాదని ఆదేశించిన ధర్మాసనం.. సెప్టెంబరు 4వ తేదీ లోపు వివరణ ఇవ్వాల్సిందిగా కిరణ్‌ బేడీ, లక్ష్మీనారాయణన్‌లకు నోటీసు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

Related Posts