YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలఫై ఆర్‌బీఐ కఠిన వైఖరి

నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలఫై ఆర్‌బీఐ కఠిన వైఖరి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రభుత్వం నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల విషయంలో ఆర్‌బీఐ కఠిన వైఖరిని తీసుకోవడంతో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ రంగం తీవ్రమైన నగదు కొరతతో అవస్థలు పడుతోంది. దీని ప్రభావం దేశీయ రుణమార్కెట్‌పై కూడా చూపిస్తోంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం 1,851 ఎన్‌బీఎఫ్‌సీల అనుమతులను రద్దు చేసింది. దీనితో దేశంలో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల సంఖ్య పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 8రెట్లు ఎక్కువ. ఈ విషయాన్ని ఆర్‌బీఐనే సమాచారహక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,700 ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే ఉన్నాయి. పదేళ్లలో ఇదే అత్యల్పం. వీటిల్లో కూడా చాలా సంస్థలకు కనీస నగదును నిల్వలను నిర్వహించడం కూడా కష్టంగా మారింది.‘‘నిబంధనల ప్రకారం కనీసం రూ.2కోట్లు కూడా సేకరించలేని పరిస్థితుల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల అనుమతులను ఆర్‌బీఐ రద్దు చేసింది.’’ అని ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ డీజీ మహేష్‌ థక్కర్‌ పేర్కొన్నారు. మరోపక్క ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం బ్యాంకుల ద్వార నగదు అందజేసి ఉపశమనం కల్పించాలని కోరుతున్నాయి. దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌లు బాండ్లు, ఇతర చెల్లింపుల్లో విఫలం కావడంతో ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు తెరపైకి వచ్చాయి. మరోపక్క ఆర్‌బీఐ కూడా ఎన్‌బీఎఫ్‌సీల్లో చీఫ్‌ రిస్క్‌ఆఫీసర్‌ను నియమించాలనే నిబంధన తీసుకురావడం, నిబంధనలను కఠిన తరం చేయడంతోపాటు ఎన్‌బీఎఫ్‌సీ నగదు నిల్వలను బలోపేతం చేయడానికి పలు రూల్స్‌ను అమలు చేసింది. మరోపక్క ప్రభుత్వం కూడా ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్‌బీఐ పట్టును మరింత బిగించింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను కూడా నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ నుంచి ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకొచ్చింది.

Related Posts